Madanapalle Fine Arts

Welcome to Madanapalle Fine Arts

తెలుగుభాషా సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణలో భాగంగా సంగీత, నృత్య, సాహిత్య, నాటక రంగ అభివృద్ధే ధ్యేయంగా “మదనపల్లి ఫైన్ ఆర్ట్స్ అకాడమి” కుల, మత, లింగ, వర్గ, భేదాలకు అతీతంగా తెలుగు జాతి ప్రజలందరిలో దాగివున్నా ప్రతిభను వెలికి తీయడానికి ఒక వేదిక అవసరాన్ని గుర్తించి, 1991 సం|| లో “మదనపల్లి ఫైన్ ఆర్ట్స్ అకాడమి” ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరము సాంస్కృతిక పోటీలు మదనపల్లిలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది.

About Madanapalle

మదనపల్లి ప్రాంతం రాయలసీమలోనే కాకుండా మన దేశంలోనే గొప్ప విద్యా, వైద్య ఆరోగ్య రంగాలలో ఎంతో ప్రసిద్ధి చెందినదని మీకు విధితమే. చిత్తూరు జిల్లా మదనపల్లి గురించి తెలియని వారుండరు…

మదనపల్లి ప్రాముఖ్యత : విశ్వకవి రవీంద్రుని జనగణ మన జాతీయ గీతాలాపన కేంద్రము, డా|| అనిబిసెంట్ గారిచే ధియోసోఫికల్ కళాశాల ప్రారంభం. ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత గౌ|| శ్రీ జిడ్డు క్రిష్ణమూర్తి గారి జన్మస్థలం క్రొత్త తరహా విద్యా విధానం రిషివ్యాలీ కేంద్రం ప్రఖ్యాత ఆరోగ్య టి.బి. శానిటోరియం (ఆరోగ్యవరం) పేరొందిన చర్చ్ అఫ్ సౌత్ ఇండియా విద్య వైద్యం, ప్రఖ్యాత జామియా మసీదు ప్రార్ధన మందిరం. ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన చల్లని వాతావరణ కేంద్రం, అన్నిటికి మించి మత సామరస్య కేంద్రం మొదలగు ఇలాంటి ఎన్నో ప్రతేకతలు కలిగిన మదనపల్లి ప్రాంతానికి ఒక “సాంప్రదాయ సాంస్కృతిక, మానసిక వికాస శిక్షణ అకాడమీ కేంద్రం” ఏర్పాటు అవసరం ఎంతైనా ఉంది.

© 2014 - Madanapalle Fine Arts Powered by GM Online